అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తుందో రాదోనన్న ఆవేదనతో అన్నాడీఎంకే నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.
సేలం : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తుందో రాదోనన్న ఆవేదనతో అన్నాడీఎంకే నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని ఓ చౌదాపురానికి చెందిన శేఖర్(41) అన్నాడీఎంకే నాయకుడు. కొం త కాలంగా జయలలిత నిర్ధోషిగా విడుదల కావాలని కాంక్షిస్తూ ఆల యాల బాట పట్టాడు.
సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని శనివారం మిత్రుల వద్ద వాపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శేఖర్ రాత్రి తన ఇంట్లో ఊరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెన్నందూరు పోలీసు ఇన్‌స్పెక్టర్ జగన్నాథన్ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. శనివారం సాయంత్రం నుంచి తీవ్ర మనో వేదనతో శేఖర్ ఉన్నట్టు కుటుంబీకులు పేర్కొనడంతో అమ్మకోసం ఆత్మహత్య చేసుకున్నాడన్న నిర్ధారణ అయింది.