
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. రుణవిముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో బ్యాంకులు రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేటును పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని కోర్టు తేల్చింది. బ్యాంకులు ప్రజలకిచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉందంటూ ఏ కోర్టులూ విచారణ జరపరాదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం–1949లోని సెక్షన్ 21ఏ చెబుతోంది. రైతుల రుణాలు రాష్ట్ర జాబితాలోని అంశమనీ, దీంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుందని సుప్రీం తేల్చింది.