సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది.
2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్‌కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది.
‘పైగా’భూములని పేర్కొంటూ..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.
తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
రసీదులన్నీ నకిలీవే..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు.
2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్‌లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment