పెదకాకానిలో సత్రాన్ని స్వాదీనం చేసుకున్న దేవదాయ శాఖ
18 ఏళ్లుగా ఆక్రమణదారులతో న్యాయపోరాటం
20 సెంట్ల భూమి విలువ రూ.3 కోట్లు
ఆలయానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
శిథిలావస్థలో ఉన్న సత్రం కూల్చివేత
పెదకాకాని: దేవదాయ శాఖ 17ఏళ్ల పాటు చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 20 సెంట్ల స్థలాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా అమరా వారి సత్రం పెదకాకాని శివాలయం దేవస్థానానిదే అని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆలయ అధికారులు మంగళవారం దానిని స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. 1942లో గుంటూరుకు చెందిన అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకట సుబ్బారావులు గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయం ఎదురుగా ఉన్న 20 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు.
ఆ భూమిలో భక్తుల సౌకర్యార్థం సత్రం నిర్మించారు. వారి అనుమతితో 1968లో దేవదాయ శాఖ ఆ«దీనంలోకి తీసుకుని కొంతకాలం గడిచిన తరువాత సత్రం యజమానుల నుంచి కంట్రిబ్యూషన్ వసూలుచేశారు. సత్రం నిర్వాహకులు ఆ సత్రంలో పనులకు యండ్రప్రగడ సీతారామయ్య, వెంకటరత్నం (భార్యభర్తలను)లను నియమించి వారికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 2006లో అప్పటి ఆలయ ఈఓ బీహెచ్ వీరారెడ్డిని ఆ సత్రానికి సింగిల్ ట్రస్టీగా దేవదాయ శాఖ అధికారులు నియమించారు.
ఆ తర్వాత కొంతకాలానికి సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ సీతారామయ్య సత్రం తనదేనంటూ భార్య వెంకటరత్నంకు వీలునామా రాయడం.. వెంకటరత్నం తన కుమారుల్లో ఒకరైన సాంబశివరావుకు రిజి్రస్టేషన్ చేశారు. ఆ తర్వాత 2005లో సత్రాన్ని ఖాళీ చేయాలని ఆలయ అధికారులు కోరడంతో అందులో ఉంటున్న యండ్రప్రగడ కుటుంబం సత్రం తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
సత్రం పూర్తి హక్కులు శివాలయానికి..
జిల్లా న్యాయస్థానం నుంచి ఈ కేసు వ్యవహారం 2008లో ట్రిబ్యునల్‌కు చేరడంతో 2011లో సత్రం ఆలయానికి చెందినదేనని తీర్పు వచ్చింది. అప్పటికే సత్రంలో పని కల్పిస్తే సత్రాన్ని స్వాధీనం చేసుకున్నారని భావించిన సత్రం యజమానులు అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకటసుబ్బారావు కుటుంబ సభ్యులు 2008లో ఆ సత్రం పూర్తి హక్కులు శివాలయానికి కల్పిస్తూ రిజి్రస్టేషన్ చేశారు. సత్రాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొందరు అధికారుల ఉదాశీన వైఖరితో ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు.
అప్పటి గ్రామపెద్ద ఆలపాటి రామస్వామి కూడా అమరా వారి సత్రం ఆలయానికి చెందినదేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. గత నెల 21న అమరా వారి సత్రం సంపూర్ణ హక్కులు పెదకాకాని శివాలయానికి చెందినవేనని హైకోర్టు తీర్పు ఇచి్చంది. దీంతో సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ వెంకటరత్నంకు పదిరోజుల పాటు ఆలయ శివ సదనంలో ఒక రూంలో ఉండేందుకు అనుమతించి మంగళవారం సత్రాన్ని ఖాళీ చేయించారు.
అనంతరం శిథిలావస్థకు చేరిన సత్రాన్ని కూలి్చవేశారు. ఈ భూమి శివాలయానికి చెందినదని.. ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులని ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment