సింగపూర్: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐటీఎన్‌ఎల్) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్ కోర్టులో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్‌ఎస్‌బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్ అప్’ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్‌ఎస్‌బీసీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని ఒక సంస్థపై ఈ తరహా పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్ జారీచేసిన 1,000 మిలియన్ల చైనా యువాన్ల (రూ.1,050 కోట్లకుపైగా) విలువైన బాండ్లలో హెచ్‌ఎస్‌బీసీ పెట్టుబడులు పెట్టింది. నిజానికి ఈ బాండ్లు 2021లో మెచ్యూరిటీకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment