ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన మంత్రి పార్ధసారథికి చుక్కెదురైంది. గతంలో పార్ధసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్ధించింది. ట్రి బ్యునల్ విధించిన రూ.1,5 లక్షలు జరిమానాను పార్ధసారథి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా మంత్రి పార్ధసారథి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నాలుగు వారాల గడువును ఇచ్చింది.