
ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు
గుంటూరు: మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ లక్ష్మికి కోర్టులో చుక్కెదురైంది. బుధవారం ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్‌ను విచారించిన మూడో అదనపు జిల్లా కోర్టు.. ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొటూ లేఖరాసి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య అనంతరం పరారీలో ఉండి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన లక్ష్మికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.