
న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి చేసిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. బిభవ్‌కుమార్‌పై మలివాల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు.
మలివాల్ కావాలనే సీసీ కెమెరాలు లేని చోటే తనపై దాడి జరిగిందని కేసు పెట్టారన్నారు. అయితే బిభవ్‌కుమార్ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తీస్‌హజారీ కోర్టు తన బెయిల్‌కు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై బిభవ్‌కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment