న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్‌పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించున్నారు.
ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.బెయిల్‌పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుదీ తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment