న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది.
పిటిషన్‌పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు.
ఒకవేళ బెయిల్ ఇస్తే ఎలాంటి షరతులు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్ సీఎంగా ఏవైనా ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్‌స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment