మాల్యా అప్పీల్పై బ్యాంకులకు ఆదేశాలు
మాల్యా అప్పీల్పై బ్యాంకులకు ఆదేశాలు
Published Mon, Aug 29 2016 2:30 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
కోర్టు ధిక్కార చర్యల నోటీసులను రీకాల్ చేయాలంటూ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా నమోదుచేసిన అప్పీల్పై బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా విజయ్ మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మాల్యాకు నోటీసులు జారీఅయ్యాయి. అయితే ఆ నోటీసులను రీకాల్ చేసుకోవాలంటూ మాల్యా అప్పీల్కు వెళ్లారు.
ఈ అప్పీల్పై పదిరోజుల్లో ఎస్బీఐ స్పందించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ ఆదేశించారు. ఈ అప్పీల్పై విచారణను 2016 సెప్టెంబర్ 27కు సుప్రీంకోర్టు వాయిదావేసింది. మాల్యా తన ఆస్తుల వివరాలన్నింటినీ వెల్లడించి రుణ బకాయిల సెటిల్మెంట్కు ప్రయత్నించారని, కానీ ఎలాంటి సెటిల్మెంట్ కుదరలేదని లిక్కర్ బ్యారన్ న్యాయవాది మహేశ్ అగర్వాల్ వాదించారు. కోర్టు ధిక్కరణకు ఆయన పాల్పడలేదని పేర్కొన్నారు. రూ. 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసును తప్పించుకునేందుకు రూ. నాలుగువేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని మాల్యా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ను బ్యాంకులు తిరస్కరించడంతో గత ఏప్రిల్ లో ఆస్తుల వివరాలు తెలియజేయాలని మాల్యాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Advertisement