న్యూఢిల్లీ: వేలకోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి కోర్టు గైర్హాజరయ్యారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తులవివరాలను పూర్తిగా వివరించాలన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో లిక్కర్ కింగ్ మాల్యా సోమవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే ఈ ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయని మాల్యా మళ్లీ ముఖం చాటేయడంతో తదుపరి విచారణను సుప్రీం వాయిదా వేసింది. జస్టిస్ ఎ. కె. గోయెల్, యు. యు. లలిత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేను జూలై 14కు వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో సోలిసిటర్ జనరల్ సహాయంతీసుకోవాల్సింది సూచించింది. అటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రిప్రజెంటేషన్ కూడా లేకపోవడం గమనార్హం. సుప్రీం ముందు ఎంహెచ్‌ఏ కౌన్సిల్ కూడా హాజరుకాలేదు.
మరోవైపు ఈ కేసులో ఈ రోజు మాల్యాకు శిక్షను ఖరారు చేస్తూ సుప్రీం తీర్పు వెలువరించనుందని భావించారు. ఈ నేరం కింద కనీసం ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, లేదా రెండూ విధించే అవకాశంఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
కాగా పలు మార్లు కోర్టు కు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్యా వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించింది. సుప్రీం జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ అత్యున్నత న్యాయస్థానం మే9న ఆదేశించిన సంగతి తెలిసిందే.
మాల్యాకేసు జూలై 14కి వాయిదా
Published Mon, Jul 10 2017 2:30 PM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement