సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2002 హిట్ అండ్ రన్ కేసులో శుక్రవారం ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సల్మాన్ నిర్దోషిగా విడుదల కావడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింన కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన ఊపిరి పీల్చుకున్న ఈ భజరంగి భాయిజాన్ కి మళ్లీ కష్టాలు మొదలైనట్టయింది.
కాగా ముంబైలో సల్మాన్ ఖాన్ 2002లో కారును నిర్లక్ష్యంగా నడిపిన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌కు విధించిన ఐదు సంవత్సరాల శిక్షను బొంబాయి హైకోర్టు గత ఏడాది కొట్టివేసింది. సల్మాన్ నిర్దోషిగా తీర్పు చెబుతూ అతనిపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసిన సంగతి తెలిసిందే.