![తమిళనాడులో సుప్రీం ఆదేశాలు బేఖాతరు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51451396903_625x300.jpg.webp?itok=syEtmXEL)
తమిళనాడులో సుప్రీం ఆదేశాలు బేఖాతరు
చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తమిళనాడులో జల్లికట్టు క్రీడను కొనసాగిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ కార్యకర్తలు జల్లికట్టు నిర్వహిస్తుండగా గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ అండదండలతోనే జల్లికట్టు కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. జల్లికట్టుపై ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం అర్ధం చేసుకోవాలన్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఆమె కోరారు. జల్లికట్టుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.