క్యాన్సర్‌తో బాధపడుతోన్న హీరోయిన్ సోనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సోనాలిని సందర్శిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. సోనాలీ కూడా ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, నీతూ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సోనాలీని సందర్శించారు. ఇప్పుడు వీరి వరుసలోకి నమ్రత కూడా చేరారు.
ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి మూవీ షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళిన నమ్రత సోనాలీని కలిశారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నేను, నా కుమారుడు గౌతమ్ సోనాలీ కుటుంబాన్ని కలిశాము. తను చాలా ధైర్యం గల మహిళ. ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. త్వరలోనే మామూలు జీవితం గడపనున్నారు. నేను తనతో చాలా సేపు మాట్లాడాను. ఆమె తన అనారోగ్యం గురించి.. చికిత్స గురించి.. ఈ ప్రయాణంలో తనకు బలాన్నిచ్చిన అంశాల గురించి నాతో చర్చించారు. నేను తన కోసం ప్రార్ధిస్తానని తెలిపాను’ అంటూ నమ్రత చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment