భార్యా పిల్లలతో సంజయ్ దత్
శుక్రవారం సంజయ్ దత్ దుబాయ్ వెళ్లారు. చికిత్స కోసమా? కాదు.. వాళ్ల చిన్నారుల కోసం అని తెలిసింది. లాక్‌డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్‌లోనే ఉండిపోయారు. సంజయ్ దత్ ముంబైలోనే ఉన్నారు. ఇటీవలే సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. ఆ విషయం తెలిసిన వెంటనే సంజయ్ దత్ భార్య దుబాయ్ నుంచి ముంబై వచ్చారు.
మొన్నటి వరకూ ముంబైలో చికిత్స పొందారు సంజయ్. తాజాగా చాలా నెలల తర్వాత పిల్లల్ని చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంలో దిగిన ఫోటోను మాన్యతా దత్ షేర్ చేసి, ‘ఇలాంటి కుటుంబాన్ని నాకు ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కేవలం కృతజ్ఞతలు మాత్రమే. జీవితం పట్ల నాకెలాంటి ఫిర్యాదులు లేవు. మేమెప్పుడూ ఇలానే కలిసుండాలి... ఎప్పటికీ’ అన్నారు. త్వరలోనే చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తారట సంజయ్‌దత్.
Comments
Please login to add a commentAdd a comment