‘‘మా సంజూ బాబా బ్యాక్’’ అని అభిమానులు ఆనందపడుతున్నారు. సంజయ్ దత్‌కి లంగ్ కేన్సర్ అని తెలియగానే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొదటి సెషన్ కీమోథెరపీని ముంబైలో సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్నారట సంజయ్ దత్. చికిత్స మొత్తం పూర్తయ్యాకే ఆయన షూటింగ్స్‌లో పాల్గొంటారని చాలామంది ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంజయ్ దత్ షూటింగ్‌లో పాల్గొన్నారు. మంగళవారం ‘షంషేరా’ షూటింగ్‌కి వెళుతూ కెమెరాలకు చిక్కారాయన. కారు అద్దాలు దించి, ‘హాయ్’ అంటూ యాక్టివ్‌గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా చిత్రీకరణలో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స చేయించుకుంటారని సమాచారం. మొత్తం ఎన్ని సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుందనేది బయటకు రాలేదు కానీ, మధ్య మధ్యలో షూటింగ్స్‌లో పాల్గొనాలని మాత్రం నిర్ణయించుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment