అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్‌నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్‌ను అపోలో క్యాన్సర్ సెంటర్‌లో ప్రవేశపెట్టారు.సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్‌లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్‌తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్‌లు ఉన్నవారు కూడా సైబర్‌నైఫ్ చికిత్స తీసుకోవచ్చు.
సైబర్‌నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్‌లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్‌పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్‌ను ఉపయోగిస్తారు.
అపోలో క్యాన్సర్ సెంటర్‌లో గత 15 సంవత్సరాలుగా సైబర్‌నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్‌నైఫ్ సిస్టమ్‌ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్‌నైఫ్‌లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది.
సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్‌నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్‌లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment