
రిషీ కపూర్
ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్లారని సమాచారం. ఆ మధ్య దర్శకుడు రాహుల్ రవైల్ ‘రిషీ కపూర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా నయం అయ్యారు’ అని పేర్కొన్నారు. తాజాగా రిషీ ఇండియా తిరిగి రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. ‘ఆగస్ట్ నెలాఖరుకల్లా నేను ఇండియా రావొచ్చు. డాక్టర్ ఏమంటారో చూడాలి. కోలుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. తిరిగొచ్చేసరికల్లా 100శాతం ఫిట్‌గా ఉంటాను’ అని పేర్కొన్నారు రిషీ. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కాలంలో ఆయన కుటుంబం, ఇండస్ట్రీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన్ను న్యూయార్క్ వెళ్లి పలకరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment