యుద్ధం ముగిసిపోలేదు! | Sonali Bendre returns home to Mumbai | Sakshi
Sakshi News home page

యుద్ధం ముగిసిపోలేదు!

Dec 3 2018 5:57 AM | Updated on Dec 3 2018 8:33 AM

Sonali Bendre returns home to Mumbai - Sakshi

నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె న్యూయార్క్‌లో ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తన అనుభూతులను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటుంటారు. తాజాగా తాను ముంబై రానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారామె. దాని సారాంశం ఇలా ఉంది.. ‘‘ఇంటికి దూరంగా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా విభిన్నమైన స్టోరీలు నా చుట్టూ ఉన్నాయని తెలుసుకున్నాను. దేనికదే విభిన్నం.

నా స్టోరీలో భాగంగా ఇప్పుడు నేను ఇంటికి వెళుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ నా మనసు మాత్రం నా కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్యనే ఉంది. వారందర్నీ తిరిగి కలవబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు (క్యాన్సర్‌ చికిత్సను ఉద్దేశిస్తూ). కానీ హ్యాపీగానే ఉన్నా. ఈ హ్యాపీ ఇంట్రవెల్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితంలో నేను చేసే సాహసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి’’ అన్నారు సోనాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement