
సోనాలీ బింద్రే
క్యాన్సర్ వ్యాధికి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు నటి సోనాలీ బింద్రే. తన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారామె. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తున్నారు. అయితే, ఈ మధ్య పుస్తకాలు చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది అంటున్నారామె. ‘‘ఇంతకు ముందు చదివిన పుస్తకాన్ని పూర్తిచేయడానికి చాలా సమయం పట్టింది. కీమో థెరపీ వల్ల కంటి చూపు సరిగ్గా సహకరించడం లేదు. అందుకే పుస్తకాలు చదవడానికి కొంచెం విరామం ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ మామూలుగానే ఉంది. ‘ఎ లిటిల్ లైఫ్’ అనే కొత్త పుస్తకం చదవడం మొదలెట్టాను. నాతో పాటు మీరూ చదువుతారు కదూ’’ అంటూ ఈ ఫొటో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment