
ముంబై : న్యూయార్క్‌లో ఏడాది పాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ నీతూ కపూర్‌తో కలిసి మంగళవారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రిషీ కపూర్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అక్కడే ఉన్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించగా, న్యూయార్క్‌లోనే ఇప్పటివరకూ ఆయన సేదతీరారు. గతంలో న్యూయార్క్‌ను సందర్శించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్‌ను పరామర్శించారు. రణ్‌బీర్ కపూర్ తన గర్ల్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి పలుమార్లు రిషీ కపూర్‌ను కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment