కేన్సర్‌ను చంపే ‘స్విచ్’
మెల్‌బోర్న్: కేన్సర్ చికిత్సలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. కొన్ని ప్రత్యేకమైన వ్యాధినిరోధక కణాలు కేన్సర్ కణాలను గుర్తించి, నాశనం చేసే ప్రక్రియను అభివృద్ధి చేశారు. శరీరంలోకి ప్రవేశించే ఇతర కణాలు, కేన్సర్ కణాలను సహజ హంతక కణాలని పిలిచే వ్యాధినిరోధక కణాలు నాశనం చేస్తాయి. ఈ కణాల ‘స్విచ్’ను ఆస్ట్రేలియాలోని వాల్టర్, ఎలిజా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు.
ఐడీ2 అనే ప్రొటీన్ ఈ ‘స్విచ్’ రక్తంలోని ఇంటర్‌ల్యూకిన్-15 అనే కారకాలకు హంతక కణాలు స్పందించేలా చేస్తుంది. హంతక కణాలు క్రియాశీలకంగా ఉండేలా ఈ ఐఎల్-15 కణాలు చేస్తాయి. ఈ హంతక కణాలు రొమ్ము, కొలాన్ వంటి కేన్సర్ కణాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని గుర్తించడం చాలా ఆనందంగా ఉందని నిక్ హంటింగ్టన్ పేర్కొన్నారు.