
ఇర్ఫాన్ ఖాన్
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. దానికోసం ఆయన లండన్‌లో చికిత్స కూడా పొందుతున్నారు. అయితే ఆయన దీపావళికి ఇండియా తిరిగి రానున్నారనే వార్త షికారు చేస్తోంది. తిరిగి రాగానే ‘హిందీ మీడియం’ సీక్వెల్ ‘హిందీ మీడియం 2’ షూట్‌లో పాల్గొంటారని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.
తొలి భాగంలో ఆయనే నటించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇర్ఫాన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ‘‘డిసెంబర్ నుంచి ఇర్ఫాన్ మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటాడన్నది అవాస్తవం. కానీ దీపావళి తర్వాత ఇర్ఫాన్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారట. తిరిగి వచ్చేస్తున్నారంటే ఇర్ఫాన్ ఆరోగ్యం మెరుగుపడినట్టే అని ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment