
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే హ్యూస్టన్‌లోని ఎండీ యాండర్‌సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ దిశలో ఓ కీలకమైన ముందడుగు వేశారు. కేన్సర్ కణితులు బాగా పెరిగినపోయిన దశలోనూ క్లాస్ట్రీడియం నోవీ అనే బ్యాక్టీరియా ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వీరు నిరూపించారు. గతంలోనూ బ్యాక్టీరియాతో కేన్సర్ చికిత్సకు కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజా ప్రయత్నం ద్వారా అతితక్కువ దుష్ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ జాన్‌కూ తెలిపారు. ఎందుకంటే.. సి.నోవీ బ్యాక్టీరియా ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలోనూ బాగా పెరుగుతుంది కాబట్టి.
కేన్సర్ కణితులు ఉన్న ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 2013 – 17 మధ్య కాలంలో తాము మొత్తం 24 మంది కేన్సర్ రోగులను ఎంపిక చేసి ప్రయోగాలు చేశామని.. పదివేల నుంచి 30 లక్షల బ్యాక్టీరియాను ఇంజెక్షన్ల రూపంలో కణితుల్లోకి ఎక్కించినప్పుడు కణితుల సైజు పది నుంచి 23 శాతం వరకూ తగ్గినట్లు తెలిసిందని ఫిలిప్ తెలిపారు. ఇమ్యునోథెరపీతోపాటు బ్యాక్టీరియాను కూడా అందించడం ద్వారా కేన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని తమ పరిశోధనలు చెబుతున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment