ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ సర్కార్ కొత్త నిబంధన
అమరావతి: ఆరోగ్యశ్రీ పథకంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఇక నుంచి హైదరాబాద్‌లో వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఒక్క క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు మాత్రమే మినహాయింపు ఇచ్చింది.
ఎలాంటి అత్యవసర సేవలు అయినా ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో చేయించుకోవాల్సిందే. దీంతో రోగులు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.