
క్లోమ కేన్సర్‌కు వేపతో చెక్
క్లోమ గ్రంథి కేన్సర్ చికిత్సలో వేప ఆకులతో తయారుచేసిన ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని భారత శాస్త్రవేత్తతో కూడిన పరిశోధన బృంద అధ్యయనంలో వెల్లడైంది.
హూస్టన్: క్లోమ గ్రంథి కేన్సర్ చికిత్సలో వేప ఆకులతో తయారుచేసిన ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని భారత శాస్త్రవేత్తతో కూడిన పరిశోధన బృంద అధ్యయనంలో వెల్లడైంది. వేపాకుల్లోని నింబోలైడ్ అణువులు... కేన్సర్ కణాల వ్యాప్తి, దాడులను 70శాతం వరకు తగ్గించాయని టెక్సాస్ టెక్ వర్సిటీ హెల్త్ సెన్సైస్ సెంటర్‌లో డాక్టర్ రాజ్‌కుమార్ లక్ష్మణస్వామి బృందం వెల్లడించింది. కేన్సర్ కణాలను ఎదుర్కొనే క్రమంలో మామూలు కణాలకు హాని కల్గకుండా నింబోలైడ్ అణువులు పనిచేశాయని రాజ్‌కుమార్ తెలిపారు.