కేన్సర్ చికిత్సలో విప్లవం ట్రూబీమ్ | revolution of true bheem in Cancer treatment | Sakshi
Sakshi News home page

కేన్సర్ చికిత్సలో విప్లవం ట్రూబీమ్

Published Sat, Jan 17 2015 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

కేన్సర్ చికిత్సలో విప్లవం ట్రూబీమ్

కేన్సర్ చికిత్సలో విప్లవం ట్రూబీమ్

కేన్సర్ ఉందని తెలుసుకోవడానికి ప్రాథమికంగా భౌతిక పరీక్ష చేయాలి. ఆ తరువాత ఇమేజింగ్ టెక్నాలజీలోని ప్రాథమిక అంశమైన ఎక్స్‌రేతో నిర్ధారణ చేయాలి.

 డాక్టర్ ఎం.బాబయ్య, ఎండీ
 ఎయిమ్స్ మెడికల్ డెరైక్టర్,
 అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్,
 సిటిజన్ హాస్పిటల్, నల్లగండ్ల,
 శేరిలింగంపల్లి, హైదరాబాద్.
 ఫోన్: 9963667511, 67199999, 67191919
 www.americanoncology.com

కేన్సర్ ఉందని తెలుసుకోవడానికి ప్రాథమికంగా భౌతిక పరీక్ష చేయాలి. ఆ తరువాత ఇమేజింగ్ టెక్నాలజీలోని ప్రాథమిక అంశమైన ఎక్స్‌రేతో నిర్ధారణ చేయాలి. అయితే ఇప్పుడు రేడియేషన్ అంకాలజీ నిపుణులు కేన్సర్ కణజాలమంతా కలిసి ముద్దగా ఏర్పడిన కణుతులను రేడియేషన్ సహాయంతో చికిత్సకు ముందే స్పష్టంగా చూడగలుగుతున్నారు. అంతేకాకుండా పెట్, సీటీ స్కాన్‌తో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఏర్పడింది.
 
 కేన్సర్ చికిత్సలో పెట్‌స్కాన్‌తో పాటు సీటీ స్కాన్‌ను కలుపుకుంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. పెట్/ సీటీ స్కాన్ ద్వారా కేన్సర్ కణితి ఏ భాగంలో ఉంది? దాని పరిమాణం ఏమిటి? నిర్దిష్టంగా ఎక్కడ ఉంది అనే సమాచారం 3డి చిత్రాల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అధునాతనమైన 4డి పెట్/ సీటీ స్కాన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ స్కాన్‌తో రోగి శ్వాస తీసుకుంటున్నప్పుడు కదిలే అతి చిన్న కణుతుల కదలికలను సైతం గుర్తించవచ్చు.
 
 ప్రణాళికతోనే చికిత్స
 రోగికి ఎలాంటి చికిత్స అందించాలనే విషయంపై పక్కా ప్రణాళిక (రోడ్‌మ్యాప్) ఉండాలి. అప్పుడే చికిత్సను విజయవంతంగా అందించవచ్చు. అత్యంత శక్తివంతమైన రేడియేషన్ కాంతిపుంజాలను కణితికి మాత్రమే తగిలేలా పంపించాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అంతటి నైపుణ్యం ఉన్న వైద్యులకు కొదువలేదు. డాక్టర్ కృష్ణ కొమండూరి లాంటి నిపుణులైన వైద్యబృందం ఇక్కడ సేవలందిస్తోంది. డాక్టర్ కృష్ణ అమెరికాలోని అత్యున్నత స్థాయి కేన్సర్ చికిత్సా సంస్థ అయినటువంటి యూపీఎంసీ కేన్సర్ సెంటర్‌లో చీఫ్ మెడికల్ ఫిజిస్ట్‌గా చాలా కాలం పాటు పనిచేశారు. ఇదీ అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ప్రత్యేకత.
 
 చికిత్సకు ఇదే కీలకం
 చికిత్సకు ప్రణాళిక రూపొందించడంలో అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఒక అసాధారణమైన కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపకరణాలు కలిగి ఉంది. వాటిని ఉపయోగించడానికి అత్యంత సునిశితమైన శిక్షణ పొందిన ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. అమెరికాలో ఉన్న సంస్థ ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. కేన్సర్ కణం తాలూకు పూర్తి స్వరూపాన్ని (సిమెట్రీ) కొలిచి నిర్ధారణ చేసి చికిత్స చేసే వాళ్లను డూసిమెట్రిస్ట్ అంటారు.
 
 చికిత్స సమయంలో కొన్ని వేల ప్రణాళికలను సిద్ధం చేసి దానికి అనుగుణంగా చికిత్స అందించడం జరుగుతుంది. అమెరికన్ బోర్డు చేత ప్రామాణిక ధృవీకరణ పొందిన డా॥బి.ఎల్.ఎన్.రాజు, సిటిజెన్ ఆసుపత్రిలో ప్రఖ్యాతి గాంచిన శస్త్ర చికిత్సా నిపుణులు డా॥సింహాద్రి చంద్రశేఖర్ వంటి ప్రముఖ వైద్యులు ఈ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. అమెరికన్ ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యంతో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సహకారంతో రాష్ర్ట ప్రజలకు ఇతోధికంగా సేవలందిస్తోంది.
 
 ట్రూబీమ్‌తో కచ్చితత్వం
 చికిత్సకు ప్రణాళికను సిద్ధం చేశాక డూసి మెట్రిస్ట్స్ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చెందిన, అత్యంత సునిశితమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ట్రూబీమ్ ఆక్సిలరేటర్ సహాయంతో చికిత్స అందిస్తారు. దీని సహా యంతో కచ్చితంగా కణితి భాగాలకు మాత్రమే తగిలేలా అత్యంత శక్తివంతమైన కిరణాలను ప్రయోగిస్తారు. కిరణాల సునిశితత్వం, కణితి భాగాలను కచ్చితంగా నిర్ణయించి చికిత్స కోసం ఇమేజ్ గెడైడ్ రేడియోథెరపీ (ఐజీఆర్‌టీ), ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (ఐఎంఆర్‌టీ), గేటెడ్ రేడియో ఆర్‌‌కథెరపీ విధానాలను ఉపయోగిస్తారు. ఈ ట్రూబీమ్ రేడియోథెరపీలో అనేక రకాల కిరణాలను ఉపయోగించే సౌకర్యం ఉంటుంది. అయితే రోగికి ఏది పూర్తి ఫలితాలను అందిస్తుందో వైద్యులు నిర్ణయించి ఆ మేరకు చికిత్సను అందిస్తారు. గతంలో ఈ చికిత్సకు చాలా సమయం పట్టేది, కానీ ఇప్పుడు అరగంట వ్యవధిలోనే చికిత్స మొత్తం పూర్తవుతోంది. ట్రూబీమ్ సహాయంతో రోగకణజాలాన్ని కొలవడం ఎంత సునిశితంగా ఉంటుందంటే మిల్లీమీటర్లలోని కొంత భాగాన్ని కూడా దీని సహాయంతో గణించవచ్చు.
 
 ఇలా చేయడానికి అది ఇంటిగ్రేటెడ్ కోన్ బీమ్ సీటీస్కాన్ సహాయం తీసుకుంటుంది. దీని సహాయంతో ఒక సెకను వ్యవధిలోనే తాను కొలచిన కొలత సరిగ్గా ఉన్నదీ లేనిదీ 100 సార్లు సరి చూసు కుంటుంది. ఒకవేళ ఏ మాత్రం తేడా ఉన్నా మరింత కచ్చితత్వం వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చికిత్స కచ్చితంగా వ్యాధి ఉన్నచోట మాత్రమే జరిగేందుకు ఇది ఎంత గానో దోహదప డుతుంది. ప్రస్తుతం ఈ పరిక రానికి సరితూగే స్థాయిలో మరే పరికరం లేదంటే అతిశయోక్తి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement