మళ్లీ మీ ముందుకు వస్తున్నా | Irrfan Khan to Resume Work After Cancer Treatment | Sakshi
Sakshi News home page

మళ్లీ మీ ముందుకు వస్తున్నా

Published Thu, Apr 4 2019 6:26 AM | Last Updated on Thu, Apr 4 2019 6:26 AM

Irrfan Khan to Resume Work After Cancer Treatment - Sakshi

ఇర్ఫాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ తిరిగి ముంబై చేరుకున్నారు. న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌ కారణంగా ఆయన కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిగా లండన్‌లో చికిత్స తీసుకుంటున్న ఇర్ఫాన్‌ ఆరోగ్యం బాగా మెరుగుపడిందట. ఈ సందర్భంగా ఆయన ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను ట్వీటర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘‘బహుశా జీవితంలో గెలవాలనే తాపత్రయంలో మనల్ని ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారిని గుర్తుపెట్టుకోం.

మనం జీవితంలో అసహాయులమైనప్పుడు వారందరూ జ్ఞప్తికి వస్తారు. సాగిపోతున్న నా ఈ జీవితంలో ఒక్క క్షణం ఆగి నన్ను ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానమే నన్ను కోలుకునేలా చేశాయి. మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను’’ అని ఇర్ఫాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ మూవీ ‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్‌లో ఇర్ఫాన్‌ నటించబోతున్నారన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement