
గత కొంతకాలంగా ఎండోక్రైన్ క్యాన్సర్ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇర్ఫాన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ‘గెలుపు ముసుగులో ఒక్కోసారి ప్రేమించబడటం అనే విషయం మనకు పెద్దదిగా తోచదు.. దాన్ని పట్టించుకోం..మర్చిపోతుంటాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తుకు వస్తుంది. అందుకే నేను వెనక్కి రావాలనుకుంటున్నాను. మీ అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలపడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అనారోగ్యాన్ని నయం చేసుకునే క్రమంలో మీ ప్రేమ, మద్దతు నాకు ఉపశమనాన్ని కల్గించాయి. మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు ఇర్ఫాన్.
— Irrfan (@irrfank) April 3, 2019
ఇర్ఫాన్ ఖాన్ నిన్ననే ఇండియా వచ్చారు. త్వరలోనే ఆయన ‘హిందీ మీడియం’ సీక్వేల్‌లో నటిస్తారని సమాచారం. ఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. (చదవండి : నా స్టేషన్ ఇది కాదే!)
Comments
Please login to add a commentAdd a comment