
అమ్మా.. ఇంటికి తీసుకెళ్లమ్మా.. నాకు ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు. ఇంట్లో అన్నయ్యతో అడుకోవాలని ఉందమ్మా అంటూ ఒక్కతీరుగా బతిమాలుతున్నాడు రమేశ్. కానీ అతనికి ఎలా చెప్పను? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో లేనని ! అప్పుడు ఐదేళ్లు నిండిన నా కొడుకు రమేశ్ మళ్లీ ఇంటి ముఖం చూడగలడా?
పిల్లలే ప్రపంచం
నా భర్త ఆది నెలంత కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులు నాకు. నా ఇద్దరు పిల్లలకు ఉండటానికి ఇళ్లు , తినడానికి తిండికి సరిపోతుంది. ఆస్థిపాస్తులు లేవన్న దిగులు మాకు పెద్దగా లేదు. ఎందుకంటే ఆటపాటలతో ఇంటికి అందం తెచ్చే ఇద్దరు పిల్లలు మాకు ఉన్నారు. వాళ్ల అల్లరితో మా ఇంట్లో ఎప్పుడు పండగే అన్నట్టుగా ఉండేది.
ఆస్పత్రికి వెళితే
నా చిన్న కొడుకు రమేశ్ కొంత కాలంగా నీరసంగా ఉంటున్నాడు. పదేపదే జ్వరం వచ్చి పోతుంది. దగ్గరల్లో డాక్టరుకు చూపిస్తే నయమవడం లేదు. అందుకే విశాఖపట్నం తీసుకుపోయాను. అక్కడ రమేశ్‌కు మరికొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె పగిలే వార్తను చెప్పారు.
బోన్‌మ్యారో తప్పనిసరి
రమేశ్ హెల్త్ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు.. ‘ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా’ అనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టుగా చెప్పారు. ఈ వ్యాధి నయం కావాలంటే మజ్జా మార్పిడి (హాప్లో- ఐడెంటికల్ అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ / బోన్‌మ్యారో, స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) ఆపరేషన్ చేయాలని చెప్పారు.
ట్రీట్‌మెంట్‌కి రూ. 20 లక్షలు
రమేశ్ ప్రాణాలు దక్కాలంటే తాము సూచించిన ట్రీట్‌మెంట్ చేయక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఈ ట్రీట్‌మెంట్‌కి 30 రోజుల సమయం పడుతుందని, అందుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. ఎలాగైనా నా బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలని పొదుపు చేసిన డబ్బులు, లోనుగా తీసుకున్న నగదుతో పాటు తెలసిన అందరి దగ్గర చేబదులు తీసుకున్నాం. అంతా ట్రీట్‌మెంట్‌కే ఖర్చయి పోయింది.
కాపాడండి
ఇప్పుడు రమేశ్ ప్రాణాలు దక్కాలన్నా .. ఐదేళ్ల వయస్సు ఉన్న వాడు రేపటి భవిష్యత్తును చూడాలన్నా ఖరీదైన ట్రీట్‌మెంట్ చేయించకతప్పదు. కానీ ఇప్పుడు అంత ఖర్చుతో ట్రీట్‌మెంట్ చేయించే స్థోమత మాకు లేదు. అలా అని నా బిడ్డను చూస్తూ.. చూస్తూ.. చావు ఒడికి చేర్చలేను. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో గురించి తెలిసి, వారిని కలిశాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. రమేశ్‌కి రేపటి రోజులను అందించండి. కొడిగట్టుకుపోతున్న వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్)
Comments
Please login to add a commentAdd a comment