రాగి గిన్నెల్లో నీరు తాగడం మంచిదని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెగ వాడేస్తుంటారు. రాగి పాత్రలో తినడం కూడా మంచిదే కానీ కొన్నింటికి దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కేవలం కొన్ని పదార్థాలకే పరిమితం. భోజనానికి కూడా రాగి ప్లేట్లు వాడుతుంటారు. కానీ కొన్ని రకాలు పులుపు వంటి పదార్థాలు రాగి గిన్నెలో తినకపోవటమే మంచిది. ముఖ్యంగా పెరుగు లాంటివి తింటే చాలా ప్రమాదం. అసలు రాగి పాత్రలో ఎలాంటి పదార్థాలు ఎలాంటి పానీయాలు తాగకూడాదో చూద్దామా!
- ముఖ్యంగా మామిడికాయ, పచ్చళ్లు, జామ్‌లు ఎప్పుడు రాగిపాత్రల్లో తినకూడదు, భద్రపరచకూడదు. ఈ ఆహారాలతో రాగి రియాక్షన్ చెందుతుంది. తత్ఫలితంగా వికారం లేదా వాంతులు వంటివి రావొచ్చు. లేదా పాయిజనింగ్‌కి దారితీయొచ్చు.
- ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది చాలమందికి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అయితే ఇలాంటి పానీయాలు కూడా రాగి గిన్నెల్లో తాగకపోవడమే మంచిది. ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చర్య పొంది కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు సంబంధిత సమ్యలు తలెత్తుతాయి.
- అలాగే రాగి పళ్లెంలో అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం అస్సలు తినొద్దు. పెరుగులోని గుణాలు రాగితో ప్రతిస్పందిస్తాయి దీంతో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.
- ఇక ఇతర పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం కూడా హానికరమే. పాలలోని ఖనిజాలు విటమిన్లలు రాగితో రియాక్షన్ చెంది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది.
(చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!)
Comments
Please login to add a commentAdd a comment