మార్కెట్‌లో దీనికి రూ.10 కోట్ల ధరంటూ ఎర
రైస్ పుల్లర్ పేరు చెప్పి ముగ్గురు కేటుగాళ్ల దందా
అరెస్టు చేసిన ఉత్తర మండల టాస్‌్కఫోర్స్ టీమ్
సాక్షి, హైదరాబాద్: గతంలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ చేతిలో మోసపోయిన ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారం ఎత్తారు. వీళ్లూ వరుసపెట్టి మోసాలు చేయడం ప్రారంభించారు. రూ.2500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియశక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. మరో రూ.23 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. రైస్ పుల్లర్లుగా పిలిచే ఇరీడియం నాణేల పేరుతో మోసం చేసే ముఠాలు గతంలో అనేకం ఉండేవి. 2015లో ఇలాంటి ఓ గ్యాంగ్ బారినపడిన స్నేహితులు ఓల్డ్ అల్వాల్ వాసి పి.శివసంతోష్ కుమార్, ఏపీలోని పలమనేరుకు చెందిన జి.మంజునాథ్‌రెడ్డి, బెంగళూరు వాసి ప్రతాప్ ఎస్సార్ రూ.5 లక్షలు నష్టపోయారు.
దీంతో తామూ అదే పంథాలో మోసాలు చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. మంజునాథ్‌రెడ్డి రాగి గిన్నెను కొని తన వద్ద ఉంచుకున్నాడు. దీనికోసం ఓ గాజు బాక్సు, చుట్టూ ధర్మకోల్ షీట్లు పెట్టి అదేదో అద్భుత వస్తువు అన్నట్లు రూపొందించాడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తనకు పరిచయమైన వారితో రైస్ పుల్లర్స్ పేరుతో ఎర వేసేవాడు. అతీంద్రియశక్తులు ఉన్న ఈ గిన్నెలు ఎవరి వద్ద ఉంటే వాళ్లు కోటీశ్వరులు అవుతారని, వివిధ రకాలైన ప్రయోగాల్లో వినియోగించే ఆ గిన్నెలకు భారీ రేటు ఉంటుందని నమ్మించేవాడు.
ఇలానే ఇతడికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ను నమ్మబలికాడు. ఆ పాత్రను రూ.10 కోట్లకు ఖరీదు చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన అప్రెచెస్ అండ్ రీసెర్చ్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ వద్ద శశికాంత్‌ను కలిసిన శివ సంతోష్ తాను సదరు కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డీఆర్‌డీఓ నుంచి స్కానింగ్ మిషన్ తీసుకువచి్చ, ఈ పాత్రను స్కానింగ్ చేయించి, సైంటిస్టు నుంచి సర్టిఫికెట్ పొందాలని చెప్పాడు. అప్పుడు రంగంలోకి దిగిన ప్రతాప్ డీఆర్‌డీఓలో పని చేసే సైంటిస్ట్ రవీంద్ర ప్రసాద్‌గా శశికాంత్‌కు పరిచయం అయ్యాడు.
స్కానింగ్, సరి్టఫికేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇలా ముగ్గురి మాటలు నమ్మిన బాధితుడు ఈ నెల 6న వారికి రూ.25 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ స్కానింగ్ మిషన్ తీసుకురాని మంజునాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. అదేమిటంటూ నిదీయగా... మరో రూ.23 లక్షలు అవసరమని చెప్పాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ ఠాణాలో కేసు నమోదైంది.
వీరి వ్యవహారంపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు పి.గగన్‌దీప్, శ్రీనివాసులు దాసు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.25 లక్షల నగదు, రాగి గిన్నె తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ తరహా మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వీరికి కలిసి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment