నిజామాబాద్ నాగారం : ట్రాన్స్‌కో జిల్లా స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చేసే కాపర్, అల్యూమిని యం వైర్లు మాయమైన విషయమై విచారణ జరపడానికి వరంగల్ ఎస్‌ఈ కిషన్, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్‌స్వామి శుక్రవారం జిల్లాకు వచ్చారు. వారితోపాటు జి ల్లాకు చెందిన ట్రాన్స్‌కో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కిషన్ ఉదయం 11 నుంచి
రాత్రి 8 గంటల వరకు స్టోర్ రూమ్‌లో విచారణ జరిపారు. శనివారం కూడా విచారణ కొనసాగనుంది.
నెలలోగా నివేదిక..
ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల సమయంలో కాలిపోయిన కాపర్, అల్యూమినియం వైర్లను కాంట్రాక్టర్ స్టోర్ రూంలో అందించి రశీదు పొందాలి. ఆ తర్వాతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం అందించకున్నా.. అధికారులు వారితో కుమ్మక్కై రశీదులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం వైర్లను అమ్ముకొని, అధికారులకు వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ విషయం బయటికిపొక్కడంతో అప్పటి ఎస్‌ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన ఆదేశాలతో విచారణ జరిపిన ట్రాన్స్‌కో అధికారులు నలుగురు ఏఈలు, ఏడీఈని సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వరంగల్ ఎస్‌ఈ కిషన్ శుక్రవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. స్టోర్ రూమ్‌లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషిట్‌లో కామారెడ్డి ఏడీ ఈ రఘుకుమార్, నిజామాబాద్ ప్రస్తుత స్టోర్ ఏడీఈ వెంకటరమణ, కరీంనగర్ ఏఈ శ్రీహరి, సస్సెండ్ అయిన స్టోర్ ఏఈ ప్రశాంత్‌రెడ్డిల పేర్లు ఉన్నాయన్నారు. వీరిని విడివిడిగా విచారిస్తున్నామన్నారు. విచారణను నెలలోగా పూర్తి చేసి నివేదికను సీఎండీ కార్తికేయ మిశ్రాకు అందిస్తామని తెలిపారు.
‘స్టోర్ రూం’లో ఏం జరిగింది
Published Sat, Jul 19 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement