
మక్కా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు పవిత్ర మక్కాలో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రచార కన్వీనర్, జగన్ కోసం టీం సభ్యుడు షేక్ సలీం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాలని మక్కాలో ప్రార్థనలు చేశారు. వైఎస్సార్‌సీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందాలని కోరుకుంటూ మక్కా మసీదులో ప్రావాసాంధ్రులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి దువా చేశారు.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నీ వర్గాల ప్రజలను ఆదుకున్నారని, కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం ఒక వర్గానికే మేలు చేకూరుస్తున్నారని సలీమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం అధోగతిపాలైందన్నారు. మైనార్టీలు బాగుపడాలంటే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులు అందరూ కలిసి మెలిసి ఏకతాటిపై నడిచి రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి మద్దతు తెలిపి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, యువత భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోడానికి ముస్లిం మైనారిటీలు అందరూ ఏకం అవ్వాలని సలీమ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహ్మద్ సిరాజ్, షేక ఫరీద్, సిరాజుద్దీన్ పాల్గోన్నారు.