ముస్లింలకు అత్యంత పవిత్రస్థలమైన మక్కా మసీదులో శుక్రవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడింది. 107 మంది మృత్యువాతపడగా... మరో 184 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలోని మక్కా మసీదును హజ్ యాత్రను పురస్కరించుకొని ఏటా లక్షలమంది సందర్శిస్తారు. కాబాకు నలువైపులా ప్రార్థనలు చేస్తారు. హజ్ యాత్ర ఇదే నెల ప్రారంభం కానుంది. కాబా మసీదు ప్రాంగణాన్ని విస్తరించేందుకు సౌదీ పనులు చేపట్టింది. స్టేడియంలా నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒకేసారి 22 లక్షల మంది పట్టేలా 43 లక్షల చదరపు అడుగుల మేర ప్రాంగణాన్ని విస్తరిస్తున్నారు. నలుమూలలా భారీ క్రేన్లతో పనులు జరుగుతున్నాయి
Published Sat, Sep 12 2015 6:49 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement