
అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు
మక్కా: ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది.
మరోవైపు ఘటనాస్థలం వద్ద సహాయకబృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతోపాటు గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కాగా మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 220కి పెరిగింది.