old studens
-
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
బడి రుణం తీర్చుకున్నారు
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన బడి చితికిపోతుంటే ముందుకు వచ్చి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా అమలు చేశా రు. మొత్తానికి ఆ బడి రుణం తీర్చుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చినబడాంలో 1956లో ప్రభు త్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వివిధ హోదా ల్లో స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు ఊరు వచ్చిన వారంతా శిథిలావస్థలో ఉన్న బడిని చూసి చలించిపోయేవారు. బడి దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అంతా కలిసి బడిని బాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ సమావేశం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. అంతే.. ఏకంగా రెండు అంతస్తుల్లో నా లుగు గదులు, రక్షణ గోడ, ముఖ ద్వా రం ఏర్పాటైపోయాయి. కొందరు స్థలం రాసివ్వగా, మరికొందరు పనికి సాయం చేశారు, ఇంకొందరు డబ్బులు పంపించారు. మొత్తానికి రూ.25లక్షల విలువైన భవనాలను అవలీలగా కట్టేశారు. నేడు భవనాలు ప్రారంభం చినబడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు నిర్మించిన భవనాలను పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఇతర ఉపా«ధ్యాయులు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దాతలు ముందుకు రావడం సంతోషం ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు ఇలాంటి దాతలు తో డైతే పాఠశాలలు బంగారంలా తయారవుతాయి. పూర్వ విద్యార్థులు, పెద్దలు ముందుకు వచ్చి వితరణ చేశారు. రూ.25 లక్షలు ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు, వైద్య వృత్తిలో స్థిరపడినవారు సాయం అందించారు. – కె.శ్రీనివాసరావు, హెచ్ఎం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చినబడాం దాతలు నిర్మించిన ముఖ ద్వారం, ప్రహరీ -
22ఏళ్ల తర్వాత మళ్లీ బడికి..
దండేపల్లి(మంచిర్యాల): వారంతా పదో తరగతి పూర్తి కాగానే విడిపోయారు. కొందరు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో, మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ బడిలో ఒక్క చోట చేరారు. అందుకు దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేదికైంది. ఆదివారం 1995–96 పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఒకరినొకరు చూడగానే ఆనాటి మధురస్మృతులు మదిలో మెదిలాయి.. దీంతో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.. ఒరేయ్ నువ్వేనారా.. గుర్తు పట్టకుండా అయ్యావు.. అంటూ ఒకరికొకరు పలుకరించుకున్నారు. పాఠశాల ఆవరణ సందడిగా మారింది. పాఠశాల తరగతి గదులు తిరుగుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మురిసిపోయారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. జ్ఞాపికలు, మెమొంటోలు అందజేశారు. బాల్యంలోకి వెళ్లిపోయాను.. ఉన్నత చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లాను. హెచ్‌సీఎల్ లిమిటెడ్ కంపెనీలో ఏజీఎల్ గ్లాస్‌ప్యాక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యా.. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రాగానే 22 ఏళ్లు వెనక్కి బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. –రత్నభూషన్, హైదరాబాద్ ఆనందంగా ఉంది.. చిన్ననాటి మిత్రులందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంటర్మీడియెట్ పూర్తవగానే వ్యాపారంలో స్థిరపడ్డాను. వ్యాపార బిజీలో మిత్రులను కలుసుకోలేక పోయాను. పూర్వవిద్యార్థుల సమ్మేళనం ద్వారా మిత్రులు, గురువులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. –శ్రీధర్, లక్సెట్టిపేట మరిచిపోలేని అనుభూతి.. మిత్రులందరం.. సమ్మేళనలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. పాఠశాలను చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మిత్రుల్లో చాలామందిని గుర్తుపట్టలేకపోయాను. ఒకేచోట కలుసుకోవడం మధురానుభూతిని మిగిల్చింది. –సావిత్రి,గోదావరిఖని -
అపూర్వ సమ్మేళనం
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : జిల్లాకేంద్రంలోని మోడ్రన్ పబ్లిక్ స్కూల్లో 1996–97 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు కలుసుకుని జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. పూర్వ ఉపాధ్యాయులు మురళీ, సురేందర్, సాయిబాబా, సాయిప్రసాద్, నర్సింగ్‌రెడ్డి, వేణు, మహేష్, శ్రీనివాస్, ఎంవీ రమణ, బల్వంత్‌రావు, నర్సింగ్‌రావు, విజయలక్ష్మీ, అన్నపూర్ణ, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాకేష్, లక్ష్మీనారాయణ, కిరణ్, నిరీల్, ప్రసాద్, కృష్ణ, మధుతోపాటు 100మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హెచ్‌పీఎస్ వార్షికోత్సవం