అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. తర్వాత ఆయన మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో 8వ తరగతి వరకే ఆగిపోయింది. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది.
తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల బాల్యంలోనే చదవు ఆపేసి బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 1993లో ఆమెకు తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి అవకాశం దక్కింది. అలా ఆమె 90వ దశకంలోని టాప్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేశ్,జూ. ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించింది సంఘవి.
ఆ హీరోతో ప్రేమ వల్ల అవకాశాలు పోగొట్టుకున్న సంఘవి
అజిత్ సినిమా తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్‌తో ఆమె జోడిగా సినిమా ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి- విజయ్ జోడిగా మూడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశాడు. నాలుగో సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే ఆర్థాంతరంగా ఆపేశాడు. దీనికి ప్రధాన కారణం విజయ్- సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి.
తెలుగులో లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఆ డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి
శ్రీకాంత్‌తో తాజ్‌మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్న సమయంలో సంఘవి వచ్చి ఆయన్ను కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్‌లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇదే క్రమంలో చిరంజీవి,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. అలా ఆమె కెరియర్ టాప్ రేంజ్‌లో దూసుకుపోతుండగా రాజశేఖర్‌తో 'శివయ్య' సినిమాలో నటించింది. ఆ సినిమాకు తెలుగు డైరెక్టర్ అయిన సురేష్ వర్మ తెరకెక్కించాడు. సినిమా సమయంలో అతనితో ప్రమలో పడిన సంఘవి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?)
ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే పెళ్లైన ఏడాదికి భార్యభర్తల మధ్య విబేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండటం. అంతేకాకుండా షూటింగ్‌కు వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్‌లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో ఆ అవకాశం చేజార్చుకుంది.
పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు
విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో ఆమె కనిపించింది. తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తల్లి సూచన మేరకు సీరియల్స్‌లలో నటించింది. అక్కడా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్‌ఆర్‌ఐ సంబంధాన్ని ఆమె తల్లి తెచ్చింది. కొన్ని కారణాల వల్ల అదీ ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు దీంతో ఆమె పెళ్లిపై తల్లికి ఆందోళన పెరగడం. ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం ప్రారంభించింది. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను 2016లో ఆమె పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది.
సంఘవి ఆస్తుల విలువ
వెంకేశన్‌తో పెళ్లి తర్వాత ఆమె టీవి సీరియళ్లతో పాటు పలు డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ 2019 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నటి సంఘవి ఈరోజు తన 46వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరులో భర్తతో ఉంటున్న నటి సంఘవి ఆస్తి సుమారు రూ. 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment