సాక్షి, హైదరాబాద్: తొలిరోజే వెంకీమామ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళతున్న నేపథ్యంలో సీనియర్ హీరో వెంకటేశ్ స్పందించారు. ఒక వైపు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువ, మరోవైపు తన చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్‌కుడబుల్ ధమాకా దక్కినట్టయైంది. అయితే ఈ సంతోష సమయంలో తన తండ్రి మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా అంటూ తండ్రిని గుర్తు చేస్తున్నారు. తన కొడుతో పాటు, మనవళ్ళతో కలిసి సినిమా తీయాలని ఆయన ఎప్పుడు కలలు కంటుండేవారట. ఆయన చిరకాల వాంఛ వెంకటేశ్, నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘వెంకీమామ’ తో నెరవేరింది. కానీ ఈ విజయాన్ని కళ్లారా వీక్షించేందుకు ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ తన ఇన్‌స్టాలో ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్నా! మిస్ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి అని వెంకటేశ్ సూచించారు. అలాగే చైతూతో చిన్నప్పుడు దిగిన ఫోటోను, వెంకీమామ చిత్రంలోని స్టిల్‌ని పోస్ట్ చేశారు.
కాగా వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా విడుడలైన వెంకీమామ హిట్ టాక్ కొట్టేసింది. మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలోఎదురైన అనూహ్య కష్టాలు అనే కథాంశంతో సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడని క్రిటిక్స్ భావిస్తున్నారు. బహుభాషా చిత్ర నిర్మాత , అనేక సూపర్ డూపర్ హిట్స్‌ను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన డీ రామానాయుడు 2015, ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment