D Ramanaidu
-
ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?
అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. కావ్య రమేష్‌గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. తర్వాత ఆయన మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో 8వ తరగతి వరకే ఆగిపోయింది. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల బాల్యంలోనే చదవు ఆపేసి బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 1993లో ఆమెకు తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం దక్కింది. అలా ఆమె 90వ దశకంలోని టాప్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేశ్,జూ. ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించింది సంఘవి. ఆ హీరోతో ప్రేమ వల్ల అవకాశాలు పోగొట్టుకున్న సంఘవి అజిత్ సినిమా తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్‌తో ఆమె జోడిగా సినిమా ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి- విజయ్ జోడిగా మూడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశాడు. నాలుగో సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే ఆర్థాంతరంగా ఆపేశాడు. దీనికి ప్రధాన కారణం విజయ్- సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. తెలుగులో లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఆ డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి శ్రీకాంత్‌తో తాజ్‌మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్న సమయంలో సంఘవి వచ్చి ఆయన్ను కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్‌లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇదే క్రమంలో చిరంజీవి,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. అలా ఆమె కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతుండగా రాజశేఖర్‌తో 'శివయ్య' సినిమాలో నటించింది. ఆ సినిమాకు తెలుగు డైరెక్టర్ అయిన సురేష్ వర్మ తెరకెక్కించాడు. సినిమా సమయంలో అతనితో ప్రమలో పడిన సంఘవి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?) ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే పెళ్లైన ఏడాదికి భార్యభర్తల మధ్య విబేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండటం. అంతేకాకుండా షూటింగ్‌కు వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో ఆ అవకాశం చేజార్చుకుంది. పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో ఆమె కనిపించింది. తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తల్లి సూచన మేరకు సీరియల్స్లలో నటించింది. అక్కడా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని ఆమె తల్లి తెచ్చింది. కొన్ని కారణాల వల్ల అదీ ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు దీంతో ఆమె పెళ్లిపై తల్లికి ఆందోళన పెరగడం. ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం ప్రారంభించింది. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను 2016లో ఆమె పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది. సంఘవి ఆస్తుల విలువ వెంకేశన్తో పెళ్లి తర్వాత ఆమె టీవి సీరియళ్లతో పాటు పలు డ్యాన్స్ షోలకు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ 2019 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నటి సంఘవి ఈరోజు తన 46వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరులో భర్తతో ఉంటున్న నటి సంఘవి ఆస్తి సుమారు రూ. 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. -
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
వెంకీమామ హిట్ టాక్, వెంకటేశ్ భావోద్వేగ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: తొలిరోజే వెంకీమామ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళతున్న నేపథ్యంలో సీనియర్ హీరో వెంకటేశ్ స్పందించారు. ఒక వైపు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువ, మరోవైపు తన చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్కుడబుల్ ధమాకా దక్కినట్టయైంది. అయితే ఈ సంతోష సమయంలో తన తండ్రి మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా అంటూ తండ్రిని గుర్తు చేస్తున్నారు. తన కొడుతో పాటు, మనవళ్ళతో కలిసి సినిమా తీయాలని ఆయన ఎప్పుడు కలలు కంటుండేవారట. ఆయన చిరకాల వాంఛ వెంకటేశ్, నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘వెంకీమామ’ తో నెరవేరింది. కానీ ఈ విజయాన్ని కళ్లారా వీక్షించేందుకు ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ తన ఇన్‌స్టాలో ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్నా! మిస్ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి అని వెంకటేశ్ సూచించారు. అలాగే చైతూతో చిన్నప్పుడు దిగిన ఫోటోను, వెంకీమామ చిత్రంలోని స్టిల్‌ని పోస్ట్ చేశారు. కాగా వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా విడుడలైన వెంకీమామ హిట్ టాక్ కొట్టేసింది. మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలోఎదురైన అనూహ్య కష్టాలు అనే కథాంశంతో సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడని క్రిటిక్స్ భావిస్తున్నారు. బహుభాషా చిత్ర నిర్మాత , అనేక సూపర్ డూపర్ హిట్స్‌ను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన డీ రామానాయుడు 2015, ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram We miss you today Nanna! Venky Mama is now all yours. Go watch it in your nearest theatre and please don’t encourage piracy. #venkymamafromtoday #venkymama A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on Dec 12, 2019 at 7:30pm PST -
కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్
‘‘దర్శకుణ్ణి అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, మెళకువలు నేర్చుకున్నాను. అనుకోకుండా నిర్మాత అయ్యాను. 2020లో కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. హీరో ఎవరు? అంటే నేనే అవ్వొచ్చేమో!(నవ్వుతూ)’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. నేడు ఆయన పుట్టినరోజు(డిసెంబరు 9) సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ►నెల్లూరులోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు సి. కల్యాణ్ అనే ట్యాగ్ సంపాదించి ఇచ్చింది ఇండస్ట్రీయే. దర్శకులకు దాసరి నారాయణరావుగారు ఎలా ఉంటారో నిర్మాతలకు డి. రామానాయుడుగారు అలా. రామానాయుడుగారే నాకు స్ఫూర్తి. ►కొత్త సినిమా నిర్మాతలు లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నవారే సినిమా తీయాలి.. కొత్తవారు సినిమా తీయకూడదంటే ఆరు నెలల్లో ఇండస్ట్రీ మూతపడిపోతుంది. ఇప్పుడున్న నిర్మాతలందరూ ఒకప్పడు కొత్తవారే. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలని చిరంజీవిగారితో ఇటీవలే మాట్లాడాను. ‘నాకు ఏదో పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నట్లుగా ఉన్నావ్’ అన్నారాయన. త్వరలోనే ఆ బాధ్యతలు తీసుకుంటారనుకుంటున్నా. ►వేరే ఇండస్ట్రీల్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియోలు, ఆర్టిస్టులు వేర్వేరుగా ఉంటారు. కానీ టాలీవుడ్లో వీరందరూ ఇంటర్లింకై ఉన్నారు. ఆ నాలుగు సెక్టార్స్ని అండర్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులో సాగదు. ఏదో ఒక రోజు పేలక తప్పదు. ఈ రోజుల్లో ఏడాదికి దాదాపు 280 సినిమాలు విడుదలవుతుంటే... స్టార్స్ సినిమాలు వచ్చేది కేవలం 30 నుంచి 50 సినిమాలే. ఒక పెద్ద స్టార్ ఏడాదికి ఒక సినిమా చేస్తాడు. అతను ఎన్ని సినిమాలు చేసినా వారికి పనిచేసే స్టాఫ్ ఒకరే. మ్యాగ్జిమమ్ 40శాతం మారతారు. నేను నోరు విప్పితే చాలామందికి చెమటలు పడతాయి. ►గతంలో చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరఫున వెళ్లి చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గిల్డ్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ఎవరూ శాశ్వితం కాదు. నేను కూడా. తెలంగాణలో, ఆంధ్రలో వేర్వేరు ప్రభుత్వాలు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గ్రూపులయ్యాయి. చిరంజీవిగారి దగ్గరికి వెళితే ఒక ట్యాగ్.. బాలకృష్ణగారి దగ్గరికి వెళితే మరో ట్యాగ్.. పవన్ కల్యాణ్ వద్దకు వెళితో ఇంకో ట్యాగ్ కట్టేస్తున్నారు. థియేటర్స్, క్యూబ్‌లు చేతిలో పెట్టుకుని ఉండేవార ంతా ఒక్కటై వ్యాపారం చేస్తున్నారు. ఆ నలుగురి చేతుల్లో థియేటర్స్ ఉన్నాయనడం తప్పు. థియేటర్స్‌ని లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తుండటాన్ని తప్పు అనలేం. ►బాలకృష్ణగారితో నా మూడో సినిమా ‘రూలర్’. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో సెటిలైన తెలుగువాళ్ల కథ ‘రూలర్’. ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ లేదు. బాలకృష్ణ– దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్లో తప్పకుండా మరో సినిమా నిర్మిస్తాను. -
రామానాయుడు మృతికి సంతాపం తెలిపిన వామపక్షాలు, లోక్‌సత్తా
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు మృతిపట్ల సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి. చలనచిత్రరంగంలో బహుముఖ సేవలందించి, దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డును పొందిన ఆయన సినీరంగంలో ఎందరో నటీనటులు, సాంకేతికనిపుణులను పరిచయం చేసిన గొప్ప నిర్మాత అని సీపీఐనేత చాడ వెంకటరెడ్డి కొనియాడారు. చలన చిత్రరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సేవలందించారన్నారు. పలుభాషల్లో చిత్రాలను నిర్మించి, కొన్నిచిత్రాల్లో నటించిన రామానాయుడిది తెలుగుసినీరంగప్రస్థానంలో ప్రముఖస్థానమని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం తమ సందేశంలో పేర్కొన్నారు. సినీరంగంలో, ప్రజాజీవితంలో ఒక మూలస్తంభం వంటి రామానాయుడిని కోల్పోవడం తెలుగువారికి తీరనిలోటని లోక్‌సత్తానేత జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. సినీరంగంలో పేరుఫ్రఖ్యాతులు, జీవితంలో విజయాలతో పాటు స్వగ్రామం కారంచేడు, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచారని ఆయన తెలిపారు. పలువురు వామపక్ష, లోక్‌సత్తాకు చెందిన నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. -
ఆయనొక్కడే!
వంద సినిమాలు చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. వంద సినిమాల దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ వంద సినిమాల నిర్మాతలు ఎంత మంది ఉన్నారు? అంటే మాత్రం ఒకే ఒక్క సమాధానం ‘డి. రామానాయుడు’. నాలుగైదు భాషల్లో సినిమాలు తీసిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ దేశంలో ఎన్ని భాషల్లో సినిమా ఉందో, దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతలు ఎంత మంది ఉన్నారు? అనడిగితే... దానికీ సమాధానం ఒక్కటే ‘డి. రామానాయుడు’. ప్రపంచ సినీ చరిత్రలోనే ఎక్కడా కనిపించని, ఇంకెక్కడా వినిపించని ట్రాక్ రికార్డ్ ఇది. సినిమా సకలకళల సమ్మేళనమే. కానీ నిజానికి అదొక జూదం. ఎంత తేలిగ్గా శిఖరాగ్రానికి చేరుస్తుందో, అంతే తేలిగ్గా అథః పాతాళానికి తొక్కేస్తుంది. అందుకు ఎందరో నిర్మాతల జీవితాలే ఉదాహరణ. కానీ... నాయుడు మాత్రం సముద్రపు అంచున రాయి లాంటివారు. అలల తాకిడిని తట్టుకోవడమే కాదు, వాటితో అభిషేకం చేయించుకునే జాతకం ఆయనది. అందుకే నిర్మాతగా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకోగలిగారు. ఇది కేవలం అదృష్టమే అనుకుంటే పొరపాటు. దీని వెనుక అవిరళ కృషి ఉంది. స్క్రిప్ట్ చదువుకోకపోతే నిద్ర పట్టని నిర్మాత ఆయన. ప్రస్తుతం సినిమాలు తీయడం తగ్గించినా... నేటికీ ఏదో ఒక కథ చదవకపోతే ఆయనకు నిద్ర పట్టదంటే.. కథలపట్ల, కళల పట్ల ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.నిర్మాత డబ్బు పెడితే సరిపోదు. నిర్మాతకు అభిరుచి అవసరం, అవగాహన అవసరం, జడ్జిమెంట్ అవసరం. కళాత్మక దృష్టి అవసరం, విలు వలు అవసరం.. అవే రామానాయుడ్ని మూవీ మొగల్‌ని చేశాయి. ప్రస్తుతం తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అంటే నాయుడుగారే.పద్మభూషణుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన డి.రామానాయుడు పుట్టిన రోజు నేడు. 79వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. ఇలాగే వందేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ... -
‘ఆస్కా’ సమరం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఒకచోట కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు 1952లో ఏర్పడిన ఆస్కా నేడు ఒక పెద్ద ప్రతిష్టాత్మక సంఘంగా ఎదిగింది. తొలిరోజుల్లో ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు 16 ఏళ్లు ఎన్నో కష్టనష్టాల కోర్చి నడిపారు. తర్వాత ఈఎస్ రెడ్డి, ఎం.ఆదిశేషయ్య, కె.నరసారెడ్డి, కొడవలూరు సుబ్బారెడ్డి తదితర ఎందరో తెలుగు ప్రముఖులు తమ వంతు జీవం పోశారు. ఆంధ్రాక్లబ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆస్కా కమిటీకి అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులుగా ఎన్నిక కావడమే కాదు, సాధారణ సభ్యత్వం ఉన్నా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎవరి ధీమా వారిది ఆస్కాకు హోరాహోరీగా సాగుతున్న ద్విముఖపోరులో రెండు ఫ్రంట్ల వారూ గెలుపు తమదేనంటున్నారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున తాజా మాజీ అధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున మాజీ అధ్యక్షులు ఎం.ఆదిశేషయ్య అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. వేణుగోపాల్ అనే వ్యక్తి అధ్యక్షునిగా, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి కార్యదర్శిగా స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. రెండు ఫ్రంట్లలోని అభిమానుల ఓట్లు, ఆ రెండింటికీ దూరంగా మెలిగే తటస్థ సభ్యుల ఓట్లను కొల్లగొట్టాలనే వ్యూహంతో రంగంలోకి దిగిన జేకే రెడ్డి సైతం గెలుపుధీమాతో ఉన్నారు. మొత్తం 4 వేల వరకు సభ్యత్వం కలిగిన ఆస్కాలో 2,759 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆదివారం ఉదయం 9నుంచి 1గంట వరకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 8గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. భోజన విరామం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆస్కా చరిత్రలోనే తొలిసారిగా ఓటింగ్‌కు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఓటింగ్‌లో అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. అభివృద్ధే నినాదం: ఆదిశేషయ్య అభివృద్ధి బాటలో, అందరికీ అందుబాటులో నినాదమే నా ప్యానల్‌ను గెలిపిస్తుంది. గతంలో అధ్యక్షునిగా ఎనిమిదేళ్లు చేసిన అభివృద్ధే ఈనాటి ప్రగతికి పునాదులుగా చెప్పవచ్చు. నా హయాంలో జరిగిన సంస్కరణల వల్లే నేడు ఆస్కా కుటుంబ సభ్యులందరికీ ప్రీతిపాత్రమైంది. భవిష్యత్తులోనూ మరింత ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మా ప్యానల్లో కొత్తవారికి అవకాశం కల్పించాను. -
లెజెండ్స్: Dr.D రామానాయుడు