![Actress Sanghavi Visits Tirumala With Family, Her Latest Look Pics Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/30/sanghavi3.jpg.webp?itok=aEoMbHlq)
ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి తెలుగు తెరపై కనిపించక 18 ఏళ్లవుతోంది. ఆమె చివరగా కొలాంజి అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి పర్సనల్ లైఫ్‌కే పూర్తి సమయం కేటాయించింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది కానీ బయట మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే గత నెలలో మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సంఘవి.
తాజాగా మరోసారి తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సంఘవి ప్రస్తుతం జడ్జిగా సినిమాలు చేస్తున్నానని, ఏదైనా మంచి రోల్స్ వస్తే తప్పకుండా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
కాగా సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా నటించిన 'అమరావతి' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించింది. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ తళుక్కుమని మెరిసింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాలతో అభిమానులను మెప్పించింది.
సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, మృగరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, ఆంధ్రావాలా.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఆమె నటించిన హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి హీరోయిన్‌గా నటించింది. ఈమె మలయాళీ కుటుంబం నుంచి వచ్చిన ఐటీ సంస్థ అధినేత ఎన్. వెంకటేశ్‌ను 2016 ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకుంది. వీరికి 2020లో కూతురు పుట్టింది.
చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల హవా
Comments
Please login to add a commentAdd a comment