ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు.
పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
Comments
Please login to add a commentAdd a comment