Hafiz Saeed in Pakistan
-
పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ
ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు. పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! -
పాక్ ఎన్నికల్లో పోటీకి హఫీజ్ సయీద్ దూరం
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్‌కు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్ తెహ్రీక్(ఏఏటీ)తో ఎంఎంఎల్ జట్టు కట్టింది. సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు. -
సయీద్‌పై అమెరికా సూచన.. పాక్ వినేనా!
వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో యథేచ్ఛగా తిరుగుతూ.. ఉపన్యాసాలు దంచడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ పాక్‌లో అతడు యథేచ్ఛగా తిరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ఉగ్రవాద గ్రూపులు, మిలిటెంట్, తాలిబన్ గ్రూపులన్నింటినీ టార్గెట్ గా చేసుకొని వాటిని సమూలంగా నిర్మూలించాలని తాము పాకిస్థాన్‌కు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నామని అమెరికా తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రెస్ కార్యాలయం డైరెక్టర్ ఎలిజబెత్ ట్రడూ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో హింసను ఖండించకపోవడం ద్వారా అమెరికా భారత్‌కు మరింత స్వేచ్ఛను ఇస్తున్నదని సయీద్ మీడియాతో పేర్కొన్న వ్యాఖ్యల నేపథ్యంలో పాక్‌లో అతడి స్వేచ్ఛాయుత కదలికలపై ట్రడూ ఆందోళన వ్యక్తం చేశారు. అతని కదలికలపై తాము చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసినా పాక్ పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిష్కారం కోసం అన్నివర్గాల వారు కృషి చేసేందుకు తాము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.