![ACB Court Dismissed Police Memo Petition Pn MLAs Poaching Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/6/BL-Santhosh.jpg.webp?itok=ZEjxPis8)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది.
ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీరు ముగ్గురు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. మొదటి నుంచి సిట్ విచారణను హాజరుకాలేదు. అంతేకాకుండా, తమపై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలుచేయడంతో వారి మద్దతుగానే కోర్టు సైతం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఏసీబీ కోర్టు మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment