ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.
మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment