ఢిల్లీ హైకోర్టుకు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కుమార్తె.. అంజ‌లి బిర్లా | Anjali Birla Moves Delhi HC Against Social Media Posts Over Her UPSC Selection, See Details | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టుకు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కుమార్తె.. అంజ‌లి బిర్లా

Published Tue, Jul 23 2024 3:13 PM | Last Updated on Tue, Jul 23 2024 4:25 PM

Anjali Birla Moves Delhi Hc Against Social Media Posts

ఢిల్లీ : లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో తొలి ప్ర‌య‌త్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ అంజ‌లి బిర్లా త‌న తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్ని తొలి ప్ర‌య‌త్నంలో పాస‌య్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఆ పోస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అంజ‌లి బిర్లా.. త‌న ప‌రువు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని, వాటిపై ప‌రువు న‌ష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆమె వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు కోర్టు అంగీక‌రించింది.   

అయితే సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్‌ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్‌ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.

సోషల్‌ మీడియాలో పోస్టుల్లో 
అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్‌ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.

యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లా
ఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్‌ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement