న్యూఢిల్లీ: నిర్వహణపరమైన రుణాలు బాకీ పడిన చౌక విమానయాన చార్జీల సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ రామ్‌కో సిస్టమ్ దాఖలు చేసిన పిటిషన్ ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్‌ఏటీ) తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో రుణాలు, డిఫాల్ట్‌కి సంబంధి ంచిన కచ్చితమైన వివరాలు అవసరమవుతాయని, ఈ కేసులో అలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. రామ్‌కో సిస్టమ్ ఇన్వాయిస్‌లకు సంబంధించి జారీ అయిన డిమాండ్ నోటీసులను స్పైస్‌జెట్‌కు పంపినట్లు గానీ లేదా స్పైస్‌జెట్ వాటిని అందుకున్నట్లు గానీ దాఖలాలేమీ లేవని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment