
ఆప్‌కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయకపదవుల కేసు విషయంలో ఆప్ ఎమ్మెల్యేలకు ఎలక్షన్ కమిషన్(ఈసీ) వద్ద చుక్కెదురైంది. తమపై నమోదైన కేసును వెనక్కితీసుకోవాలని 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఈసీ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు తుది విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.