
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు విజయవంతమైన టోర్నీగా ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లోని పలువురు సభ్యులు ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేదు. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య కోల్‌కతాలో జరిగే ఐసీసీ సమావేశానికి వీరంతా హాజరవుతుండటంతో తాము ఐపీఎల్ చూడవచ్చని వారు ఆశించారు.
కానీ ఆయా తేదీల్లో ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా లేదు. దాంతో తమ కోసం షెడ్యూల్‌ను కాస్త మార్చి ఒక మ్యాచ్ జరిగేలా చూడమంటూ బీసీసీఐని ఐసీసీ చిరు కోరిక కోరింది. అయితే బీసీసీఐ మాత్రం అది కుదరదంటూ తిరస్కరించేసింది. ‘ఒక మ్యాచ్‌లో మార్పులు చేస్తే మొత్తం షెడ్యూల్, దానికి సంబంధించి ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు దెబ్బ తింటాయి. కాబట్టి అది సాధ్యం కాదని మేం జవాబిచ్చాం’ అని బోర్డు ఉన్నతాధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment